అతిపెద్ద మొబైల్‌ మేకర్‌గా భారత్‌: కొత్త పథకాలు

1 Jun, 2020 18:58 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారు ఇండియా:  కేంద్ర మంత్రి 

భారతీయ ఎలక్ట్రానిక్‌ రంగానికి కొత్త పథకాలు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా  నిలిచిందని కేంద్ర  న్యాయ, టెలికాం శాఖ మంత్రి  రవిశంకర్‌  ప్రసాద్‌ వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 200కి పైగా మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సోమవారం ప్రకటించారు.

భారతదేశంలో ఇప్పటివరకు 330 మిలియన్ మొబైల్ హ్యాండ్‌సెట్‌లు తయారైనట్టు  చెబుతూ దీనికి సంబంధించిన డేటాను కేంద్ర మంత్రి షేర్‌ చేశారు. 2014లో  కేవలం 2 ప్లాంట్లలో 60 మిలియన్ల మొబైల్ ఫోన్లు మాత్రమే తయారు అయ్యాయి. వీటి విలువ కూడా 2014లో 3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2019లో 30 బిలియన్ డాలర్లకు పెరిగింది. అలాగే రేపు (జూన్ 2న) మధ్యాహ్నం 12:00 గంటలకు విలేకరుల సమావేశంలో భారతీయ ఎలక్ట్రానిక్‌ రంగం కోసం కొత్త పథకాలను ప్రకటించనున్నారు. భారీ దిగుమతిదారుగా  ఉన్న భారత్‌ గత ఐదేళ్లలో బలమైన ఎగుమతిదారుగా అవతరించిందని ఎలక్ట్రానిక్స్ ఇండియా  ట్వీట్‌ చేసింది.

చదవండి : సీనియర్లకు షాకివ్వనున్న ఇన్ఫోసిస్‌
షావోమి ల్యాప్‌టాప్‌ లాంచ్‌ : ఈ నెలలోనే​

మరిన్ని వార్తలు