ప్రహార్‌ క్షిపణి పరీక్ష సక్సెస్‌

21 Sep, 2018 04:23 IST|Sakshi

బాలసోర్‌: భారీ వర్షం మధ్యనే స్వల్ప శ్రేణి క్షిపణి ‘ప్రహార్‌’ను భారత్‌ గురువారం ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణిని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో–డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనేజేషన్‌) అభివృద్ధి చేసింది. వివిధ దిశల్లో ఉన్న బహళ లక్ష్యాలను ప్రహార్‌ ఛేదించగలదని అధికారులు చెప్పారు. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి జరిపిన పరీక్షలో క్షిపణి అనుకున్న ప్రకారం పనిచేసిందనీ, 200 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించిందని వారు వెల్లడించారు. ఈ క్షిపణిలో అత్యాధునిక దిక్సూచి వ్యవస్థ, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌ సహా పలు విశేషాలు ఉన్నాయనీ, అన్ని రకాల వాతావరణాలు, ప్రాంతాల్లో ఇది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు