క్షిపణుల ప్రయోగం సక్సెస్

21 Sep, 2016 10:44 IST|Sakshi
క్షిపణుల ప్రయోగం సక్సెస్

బాలాసోర్ (ఒడిశా): భారత రక్షణదళం తన సామర్థ్యాన్ని పెంచుకొనే దిశగా మరో రెండు కొత్త క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది. ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారు చేసిన ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సుదూర క్షిపణులను (ఎల్‌ఆర్‌ఎస్‌ఏఎం) ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ ద్వారా మంగళవారం ఉదయం 10:13 గంటలకు మొదటి ప్రయోగాన్ని, 14:25 గంటలకు రెండో ప్రయోగాన్ని నిర్వహించినట్లు డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు తెలిపారు. ట్రయల్ పరీక్ష విజయవంతమైందన్నారు.

ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే భారత్, ఇజ్రాయెల్ రూపొందించిన మీడియం రేంజ్ క్షిపణిని ఈ ఏడాది జూన్ 30 జూలై 1 మధ్యన వరుసగా మూడుసార్లు విజయవంతంగా డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే లాంగ్ రేంజ్ క్షిపణి (ఎల్‌ఆర్-ఎస్‌ఏఎం)ని గతేడాది డిసెంబర్ 30న ఐఎన్‌ఎస్ కోల్‌కతా వాహక నౌకపై నుంచి కూడా విజయవంతంగా ప్రయోగించారు.

మరిన్ని వార్తలు