నల్లధనం ఇక దాగదు!

22 Dec, 2017 04:52 IST|Sakshi

వివరాల మార్పిడి ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్‌ సంతకాలు

న్యూఢిల్లీ: నల్లధనంపై పోరులో మరో ముందడుగు పడింది. ఈ విషయంలో సమాచారం పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్‌లు గురువారం సంతకాలు చేశాయి. స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌లోనూ దీనికి సంబంధించిన విధానపర ప్రక్రియ ముగియడంతో జనవరి 1 నుంచి ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ చైర్మన్‌ సుశీల్‌ చంద్ర, భారత్‌లో స్విట్జర్లాండ్‌ రాయబారి ఆండ్రియాస్‌ బామ్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆటోమేటిక్‌ సమాచార మార్పిడి(ఆఈఏఐ) ఉమ్మడి డిక్లరేషన్‌పై రెండు దేశాల మధ్య గత నెలలోనే అవగాహన కుదిరింది. దీని వల్ల స్విట్జర్లాండ్‌లో బ్యాంకు ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి వీలవుతుంది. ఆటోమేటిక్‌ సమాచార మార్పిడికి స్విట్జర్లాండ్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండగా, తమకు అందిన సమాచారం గోప్యతను కాపాడతామని భారత్‌ స్విస్‌కు హామీ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు