ఒకే ఎమర్జన్సీ నంబర్

8 May, 2016 15:46 IST|Sakshi
ఒకే ఎమర్జన్సీ నంబర్

న్యూఢిల్లీ: దేశంలో అన్ని రకాల అత్యవసర సమస్యలకు ఒకే నంబర్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పుడున్న అన్ని ఎమర్జన్సీల నంబర్ల స్థానంలో 112 పని చేయనుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికాలో ఉన్న అత్యవసర సర్వీసు నంబర్ 911 విధంగా అన్ని రకాల ఎమర్జన్సీ సమస్యలకు ఒకే ఫోన్ నంబర్ ఉండాలనే విధానానికి కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నాలుగు రకాల అత్యవసర సర్వీసు నంబర్లు పని చేస్తున్నాయి.

పోలీసు-100, ఫైర్-101, అంబులెన్స్-102, ఎమర్జన్సీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్-108 సర్వీసులు పని చేస్తున్నాయి. వీట్టన్నిటి స్థానంలో ఇకపై 112 పని చేయనుంది. ఆపదలో ఉన్న వ్యక్తి ఫోన్ చేయగానే దగ్గర్లోని సహాయ కేంద్రానికి నేరుగా సమాచారం వెల్లే విధంగా సాప్ట్ వేర్ ను రూపొందించామని కేంద్ర ప్రభుత్వ అధికారి వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సర్వీసు పని చేయనుంది.

మరిన్ని వార్తలు