ఘర్ వాపసితోనే మోదీ పాపులారిటీ తగ్గింది

3 Apr, 2015 11:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఇండియా టుడే - సిసిరో సర్వే నిర్వహించింది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని 'ఘర్వాపసి' కార్యక్రమం విపరీతంగా దెబ్బతీస్తోందని ఈ సర్వేల్లో వెల్లడైంది. ఈ కార్యక్రమంతో  ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ బాగా తగ్గిందని ఈ సర్వేలు చెబుతున్నాయి.  ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలతో పోలిస్తే.. మరో 27 సీట్లు తగ్గుతాయని ఈ సర్వేలు తేల్చాయి. గత ఎన్నికల్లో వచ్చిన 282 సీట్ల నుంచి 255 కు తగ్గే అవకాశం ఉందని ఈ సర్వేలు వెల్లడించాయి.

ఈ సర్వేలోని మరిన్ని అంశాలు..

  • ఈ సర్వేలో మొత్తం 12 వేల మంది అభిప్రాయాలను సేకరించారు.
  • నిజాయితీ పరుడిగా మోదీకి దేశంలోనే అగ్రస్థానం.
  • తిరుగులేని నేతగా మోదీ అంటూ 36 శాతం మంది ఓటు వేశారు.
  • మోదీ ప్రభుత్వం బాగుందంటూ 38 శాతం మంది ఓటు వేశారు.
  • మోదీ ప్రభుత్వం ఎక్సలెంట్ అంటే 22 శాతం మంది సమాధానం ఇచ్చారు.
  • ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై 11 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
  • దీంతో కాంగ్రెస్ 9 స్థానాలు మెరుగుపడింది.
  • బీజేపీ యూపీలో పట్టు కోల్పోతోంది.
  • యూపీలో పెరిగిన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ బలాలు.
  • రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ బలం పెరుగుతోంది.
  • పాపులారిటీలో మోదీ తర్వాత అరవింద్ కేజ్రీవాల్దే.
  • కేజ్రీవాల్కు 15 శాతం మంది అనుకూలంగా సమాధానం ఇచ్చారు.
  • ఉత్తమ ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్.
  • 2014 ఆగస్టు నెలతో పోలిస్తే.. తగ్గిన మోదీ వ్యక్తిగత పాపులారిటీ.

>
మరిన్ని వార్తలు