‘ఐదేళ్లలోపు’ మరణాల్లో భారత్ టాప్

7 Oct, 2016 02:08 IST|Sakshi
‘ఐదేళ్లలోపు’ మరణాల్లో భారత్ టాప్

న్యూఢిల్లీ: ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 2015లో భారత్‌లోనే ఎక్కువ సంభవించాయని బ్రిటన్ వైద్య జర్నల్ ‘లాన్సెట్’ అధ్యయనం ద్వారా తెలిసింది. క్షయ, ప్రసవకాల మరణాలను అరికట్టడంలో భారత్ పేలవమైన ప్రదర్శన కనబరిచిందని అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. గుండె నాళాలకు సంబంధించిన జబ్బుల వల్ల భారత్‌లో ఎక్కువ మంది చనిపోతున్నారని లాన్సెట్ తెలిపింది.

దక్షిణాసియాలోని అన్ని దేశాలు చిన్న పిల్లల మరణాలను అరికట్టడంలో విఫలమయ్యాయనీ, అత్యధికంగా భారత్‌లో 2015లో 13 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడ్డారని అందులో పేర్కొన్నారు. తాగునీరు, శుభ్రతలో పురోగతి సాధించినా ఊబకాయం, ఔషధాల సమస్యలు పెరుగుతున్నాయని నివేదిక తెలిపింది.
 

>
మరిన్ని వార్తలు