బోగీలే ఐసోలేషన్‌ వార్డులు

29 Mar, 2020 05:54 IST|Sakshi
కరోనా రోగుల కోసం రైల్వే శాఖ సిద్ధం చేసిన బోగీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఆస్పత్రి సదుపాయాలు లేకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రయాణికుల రైళ్లు రద్దు కావడంతో ఆ రైలు బోగీలను కరోనా బాధితులకు చికిత్సనందించే వార్డులుగా రూపొందించాలని ముందుకొచ్చింది. ఇందుకోసం ఒక నమూనా బోగీని కూడా తయారు చేసింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపితే మరికొద్ది రోజుల్లోనే వారానికి 10 బోగీలు తయారు చేయనున్నట్టు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్‌ కుమార్‌ వెల్లడించారు.  

బోగీలను ఐసీయూ కేంద్రాలుగా ఎలా మార్చారంటే  
► ఒక కూపేలో ఒకవైపు లోయర్‌ బెర్త్‌నే మంచం మాదిరి గా రూపొందించి అన్ని బెర్త్‌లను తొలగించారు.  
► ఆ బెర్త్‌ ఎదురుగా రోగుల సామాన్లు, వైద్య పరికరాలు ఉంచడానికి ఏర్పాట్లు చేశారు.  
► ప్రతీ కోచ్‌లో ఉండే 4 టాయిలెట్ల స్థానంలో రెండు వాష్‌రూమ్‌లుగా మార్చి ఫ్లోరింగ్‌ మార్చారు. ప్రతీ బాత్‌రూమ్‌లో హ్యాండ్‌ షవర్, బక్కెట్, మగ్‌ ఉంచారు.  
► ప్రతీ కోచ్‌లోనూ 220 ఓల్టుల ఎలక్ట్రికల్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు.  
► బోగీ వెలుపల 415 ఓల్టుల విద్యుత్‌ సరఫరా.
► బోగీకి 10చొప్పున ఇలా వార్డులు తయారు చేశారు.  
► ఇక రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఐసీయూలు, మెడికల్‌ స్టోర్‌లు, పాంట్రీలు, అధికారుల కోసం గదులు వంటివి కూడా ఏర్పాటు చేశారు.
► ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతీ వెయ్యి మంది జనాభాకి కనీసం మూడు పడకలైనా ఉండాలి. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యి మందికి 0.7 పడకలు ఉన్నట్టుగా అంచనా.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా