ఇరాన్ అణుఒప్పందానికి భారత్ స్వాగతం

3 Apr, 2015 11:37 IST|Sakshi
ఇరాన్ అణుఒప్పందానికి భారత్ స్వాగతం

న్యూఢిల్లీ: అణు కార్యక్రమాల విషయంలో ఇరాన్, ఆరు ప్రపంచ శక్తిమంత దేశాల(సిక్స్ వరల్డ్ పవర్స్) మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని తాము స్వాగతిస్తున్నామని భారత్ ప్రకటించింది. తామెప్పుడూ శాంతియుత అణుకార్యక్రమాలకే మద్ధతిస్తామని, ఆరు దేశాల ప్రతినిధులు ఇరాన్తో ఆ మేరకే చర్చలు జరిపి విజయం సాధించినట్లు తెలిపింది. దీనిపై పూర్తిస్థాయిలో జరిగే ఒప్పందంపై జూన్ 30న సంతకాలు జరగనున్నట్లు పేర్కొంది. 'ప్రపంచాన్ని మరింత శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లగల, అందరికి సముచితమైన కీలక ఒప్పందంపై జూన్ 30న నిర్ణయం జరగనుంది' అని భారత విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్ధీన్ తెలిపారు. 

ఇరాన్ అణుకార్యక్రమాల వివాదాన్ని ఆ దేశ హక్కులను గౌరవిస్తూనే శాంతియుత మార్గంలో పరిష్కరించాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని ఆయన చెప్పారు. ఆరు ప్రపంచ శక్తులు అనగా చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా, జర్మనీ. ఇవీ ప్రపంచ దేశాల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇరాన్ నిర్వహించే అణుకార్యక్రమాలను నియంత్రించడం కోసం శాంతియుత పంథాను అనుసరించేందుకు 2006లో ఏర్పడ్డాయి. టెహ్రాన్ వివాదాస్పద అణుకార్యక్రమం విషయంలో దౌత్య ఒప్పందాలు చేస్తుంటాయి.

మరిన్ని వార్తలు