కేటగిరీలుగా ఆర్మీ సిబ్బంది 

21 Apr, 2020 06:26 IST|Sakshi

న్యూఢిల్లీ: విధుల్లో తిరిగి చేరుతున్న తమ సిబ్బందిని ‘రెడ్‌’, ‘ఎల్లో’, ‘గ్రీన్‌’కేటగిరీలుగా విభజించినట్లు ఆర్మీ తెలిపింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు సెలవు నుంచి తిరిగొచ్చిన వారు, తాత్కాలికంగా వేరే విధులు నిర్వర్తించి తిరిగివచ్చినవారు, వృత్తిపరమైన శిక్షణకు హాజరై తిరిగివచ్చిన వారిని ఈ కేటగిరీలుగా విభజించామని పేర్కొంది.  కరోనా లక్షణాలున్న సైనికులను ‘రెడ్‌’ కేటగిరీలో, లక్షణాలులేకున్నా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నవారిని ‘ఎల్లో’ కేటగిరీలో, క్వారంటైన్‌ కాలాన్ని ముగించుకున్న వారిని ‘గ్రీన్‌’ కేటగిరీలో చేర్చామని తెలిపింది. నార్తర్న్‌ కమాండ్, ఆర్మీ మెడికల్, డెంటల్‌ కార్ప్స్, నర్సింగ్‌ సర్వీస్‌ల్లోని సిబ్బందిని ‘టాప్‌ ప్రయారిటీ’గా నిర్ధారించింది.   

మరిన్ని వార్తలు