పీఓకేలో పాక్‌ శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం

9 Sep, 2019 21:03 IST|Sakshi

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలతో పాటు భారత్‌లో ఉగ్రదాడులకు ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌ కుయుక్తులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రర్‌ లాంఛ్‌ ప్యాడ్లను, పాక్‌ శిబిరాలను సోమవారం భారత సైన్యం ధ్వంసం చేసింది. పాక్‌ సైనిక శిబిరాలకు చేరువగా ఉన్న ఉగ్రవాదుల లాంచ్‌ ప్యాడ్స్‌ను నిర్వీర్యం చేసింది. లీపావ్యాలీలోని ఉగ్ర శిబిరాలను భారత సేనలు ధ్వంసం చేశాయి.పాకిస్తాన్‌ సేనలు భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పించేందుకు ఈ శిబిరాలను వాడుతున్నాయి. పాక్‌ సేనల సహకారంతో జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజహిదిన్‌, లష్కరీ తోయిబా వంటి పలు ఉగ్రవాద సంస్ధలు ఈ ప్రాంతంలో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశాయి. ఈ శిబిరాల్లో ఉగ్రవాదులకు భారత్‌లో ఉగ్ర దాడులతో పాటు భారత సైన్యం కన్నుగప్పి చొరబాట్లకు ఎలా పాల్పడవచ్చనే అంశాలపై తర్ఫీదు ఇస్తారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు