తుపాకీ పడితే..అంతమే!

20 Feb, 2019 00:54 IST|Sakshi

కశ్మీర్‌ యువతకు ఆర్మీ హెచ్చరిక

శ్రీనగర్‌: కశ్మీర్‌లో తుపాకులు పట్టిన యువత లొంగిపోకుంటే అంతమొందిస్తామని భారత సైన్యం హెచ్చరించింది. 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్తాన్‌ సైన్యం, దాని నిఘా సంస్థ ఐఎస్‌ఐ పాత్ర ఉందని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. పుల్వామా దాడి జరిగిన 100 గంటల్లోపే అందుకు బాధ్యులైన జైషే టాప్‌ కమాండర్లను ఎన్‌కౌంటర్‌ చేశామని శ్రీనగర్‌ కేంద్రంగా పనిచేస్తున్న 15 కారŠప్స్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ కేజేఎస్‌ ధిల్లాన్‌ మంగళవారం వెల్లడించారు. ‘జైషే మహ్మద్‌ పాకిస్తాన్‌ ఆర్మీ మానసపుత్రిక. దాన్ని ఐఎస్‌ఐ నియంత్రిస్తోంది.

పుల్వామా దాడిలో పాకిస్తాన్‌ పాత్ర 100 శాతం ఉంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ అని ఆయన అన్నారు. మిలిటెన్సీలో చేరిన యువత తిరిగొచ్చేలా ఒప్పించాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. లేనట్లయితే వారికి కూడా జైషే ఉగ్రవాదుల గతే పడుతుందని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు