కరోనా కాటు: వ్యాపార సెంటిమెంట్‌ బేజారు

13 Jul, 2020 14:39 IST|Sakshi

పదేళ్లలో తొలిసారి  నెగిటివ్‌ జోన్‌ లోకి బిజినెస్‌ ఔట్‌లుక్‌

ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా బిజినెస్  ఔట్‌లుక్‌ సర్వే

ప్రపంచంలోనే దారుణంగా నీరసించిన  వ్యాపార సెంటిమెంట్‌

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సంక్షోభం ప్రపంచంతోపాటు భారత ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ దశల లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో భారతీయ వ్యాపార సెంటిమెంట్ గత దశాబ‍్ద కాలంలో ఎన్నడూ లేనంతగా దిగజారింది. తొలిసారి ప్రతికూలంగా మారింది. డిమాండ్‌ క్షీణత లాభాలపై వ్యాపారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ అనిశ్చితి, ఆర్థిక మందగమనంతో   ప్రపంచంలోనే అతి దారుణమైన దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటోందని సోమవారం విడుదల చేసిన  తాజా సర్వేలో తేలింది.(గుడ్‌న్యూస్‌: కరోనా డ్రగ్‌ ధర తగ్గింది)

ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా బిజినెస్  ఔట్‌లుక్‌ సర్వే ఫలితాల ప్రకారం జూన్‌లో మునుపెన్నడూ లేని స్థాయికి బిజినెస్ సెంటిమెంట్ పడిపోయింది. బిజినెస్ యాక్టివిటీ నికర బ్యాలెన్స్ జూన్‌ మాసంలో మైనస్‌ 30 శాతానికి పడిపోయింది. ఇది  ఫిబ్రవరిలో 26 శాతం పుంజకుంది. ఇదే ఈ దశాబ్దంలో అతి తక్కువ  నమోదు, అలాగే రికార్డు పతనమని సంస్థ ఎకనామిక్స్ డైరెక్టర్ ఆండ్రూ హార్కర్ అన్నారు. 2009 చివరిలో సిరీస్ ప్రారంభమైనప్పటి నుండి వ్యాపార సెంటిమెంట్‌  ప్రతికూల దృక్పథంలోకి మారడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఏడాది చివరి నాటికి స్పలంగా పుంజుకునే అవకాశం కనిపిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు