అప్‌డేట్‌: 168కి చేరిన కరోనా కేసులు

19 Mar, 2020 13:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) విజృంభిస్తోంది. బుధవారం నాటికి 158గా ఉన్న కరోనా కేసులు గురువారం ఉదయం 10 గంటల వరకు ఆ సంఖ్య 168కి చేరింది. ఈ మేరకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 13,316 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల లండన్‌ నుంచి హర్యానా చేరుకున్న ఓ యువతికి గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. అలాగే కర్ణాటక, మహారాష్ట్రలో రెండేసి చొప్పున కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో 42 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ మొత్తం 13 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. (భారత్‌ @ 158)

మరోవైపు దేశంలో రోజురోజూకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీనిపై ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. ఇక కరోనా వ్యాప్తిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం అత్యున్నత సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ మరోసారి మంత్రులు ఎస్పీలు, కలెక్టర్‌లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.  

మరిన్ని వార్తలు