ప్రధాని మోదీకి చల్లటి కబురు..!

15 Oct, 2017 14:47 IST|Sakshi

ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది

మార్పులు వల్ల తాత్కాలిక ఇబ్బందులుంటాయి

భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది

ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టినా లెగార్డే

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ (ఎంఎంఎఫ్‌) చల్లటి వార్తను చెప్పింది. యశ్వంత్‌ సిన్హాలాంటి సొంత నేతలే పెద్దనొట్ల రద్దు, జీఎస్టీపై తీవ్ర విమర్శలు చేసిన తరుణంలో ఐఎంఎఫ్‌ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరిమైన దారిలో ప్రమాణిస్తోందని పేర్కొంది. గత త్రైమాసింలో భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 5.7 శాతం వృద్ధి రేటు నమోదు చేసినా.. భవిష్యత్‌లో పుంజుకుంటుందని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టినా లెగ్రాడే ఆశాభావం వ్యక్తం చేశారు. గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ అనే కొత్త పన్నుల వ్యవస్థ రావడం వల్ల.. వ్యవస్థాగత మార్పులు చోటు చేసుకున్నాయని.. అందువల్లే వృద్ధిరేటు తక్కువగా నమోదైవుండొచ్చని ఆమె అన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అనేవి భారత ఆర్థిక వ్యవస్థను స్థిరమైన గాడిలోకి తీసుకెళతానయే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.

భారత ఆర్థిక వ్యవస్థ గాడితప్పిందని ఈ మధ్య ఐఎంఎఫ్‌ చేసిన నేపథ్యంలో లెగార్డే చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది కాలంగా పెనుమార్పులకు లోనైంది. ఈ కారణాలలో వృద్ధి రేటు నమోదలు కొన్ని ఇబ్బందులు ఎదురయి వుంటాయి.. భవిష్యత్‌లో మాత్రం జీఎస్టీ, డిమానిటైజేషన్‌ ఆర్థిక వ్యవస్థకు తిరుగులేని శక్తిని చేకూర్చుతాయని ఆమె చెప్పారు. జీఎస్టీ అమలు అనేది ఒక చారిత్రాత్మక ప్రయత్నం. ఆర్థిక వ్యవస్థ గతిని మార్చే బృహత్కార్యం వల్ల తాత్కాలిక ఇబ్బందులు తప్పవు అని ఆమె స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు