ముగిసిన త్రివిధ దళాల విన్యాసాలు

2 Mar, 2018 02:13 IST|Sakshi

ముంబై : అరేబియా సముద్రంలో మూడు వారాలుగా జరుగుతున్న త్రివిధ దళాల విన్యాసాలు గురువారంతో ముగిశాయి. ఇందులో నేవీ, ఎయిర్‌ ఫోర్స్, ఆర్మీకి చెందిన ఫైటర్‌ జెట్లు, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, పదాతిదళాలు పాల్గొన్నాయి. ‘పశ్చిమ్‌ లెహర్‌’పేరుతో పశ్చిమ తీర ప్రాంతంలో ఫిబ్రవరి 12న ఈ విన్యాసాలను ప్రారంభించారు. త్రివిధ దళాల పరస్పర సామర్థ్యాలను, కార్యాచరణ సంసిద్ధతను పరీక్షించేందుకే ఈ విన్యాసాలు చేపట్టామని నేవీ వెల్లడించింది.

ఇందులో నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, ఈస్ట్రర్న్, వెస్ట్రర్న్‌ నావిక దళాలు, జలాంతర్గాములు, 22వ కిల్లర్‌ స్క్వాడ్రన్, గస్తీ నౌకలు, తేలికపాటి యుద్ధ విమానాలు మిగ్‌ 29కె, పీ–8ఐ, ఐఎల్‌–38ఎస్‌డీ, రిమోట్‌తో నడిచే విమానాలు, పాల్గొన్నాయని తెలిపింది.

మరిన్ని వార్తలు