ఐసోలేషన్‌ కేంద్రాలుగా రైల్వే కోచ్‌లు

7 Apr, 2020 05:43 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ 2,500 కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చింది. మొత్తం 5 వేల కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా మొదటి దశలో భాగంగా 2,500 కోచ్‌ లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. వీటితో కొత్తగా 50 వేల ఐసోలేషన్‌ బెడ్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. 133 ప్రాంతాల్లో రోజుకు 375 కోచ్‌ లను బెడ్లుగా మారుస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. వైద్యుల సూచనల మేరకు పూర్తి స్థాయిలో వైద్య పరికరాలతో రూపొందించినట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు