రైల్వేలో కాంట్రాక్టు నియామకాలు

8 Jul, 2018 03:02 IST|Sakshi

న్యూఢిల్లీ: వేర్వేరు విభాగాల్లో సిబ్బంది కొరత వేధిస్తుండటంపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేల్లోని కీలక రంగాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకోవాలని నిర్ణయించింది. ఆవిరితో నడిచే లోకో మోటివ్‌లు, పాత రైల్వే బోగీలు, సిగ్నల్స్‌ నిర్వహణ, పరిరక్షణకు పదవీవిరమణ చేసిన ఉద్యోగుల సేవల్ని తీసుకోనున్నట్లు తెలిపింది. కాంట్రాక్టు నియామకాలను చేపట్టాలని అన్ని జోనల్‌ కార్యాలయాలకు రైల్వేశాఖ ఉత్తర్వులిచ్చింది. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే నియామకాల బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మాజీ ఉద్యోగుల్ని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకునే అధికారాన్ని జోనల్‌ మేనేజర్లకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ కాంట్రాక్టు విధానంలో ప్రధానంగా స్టెనోగ్రాఫర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను భర్తీ చేస్తామన్నారు.  

>
మరిన్ని వార్తలు