కరోనా క్యాంప్‌లో నృత్యాలు..

2 Feb, 2020 18:20 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న తరుణంలో.. చైనాలోని వుహాన్‌ నగరంలోని ఉన్న 647 మంది భారతీయ విద్యార్థులను ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా హాస్సిటల్‌కు చెదిన ఐదుగురు డాక్టర్ల బృందం రెండు ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానాల్లో శనివారం ఇండియాకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆ విద్యార్థులకు ఢిల్లీ స‌మీపంలోని మ‌నేస‌ర్‌లో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో వసతి ఉన్నారు. మరోవైపు ఆర్మీ క్యాంపులో ప్రత్యేక వైద్య పరీక్షల నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. (కరోనా ఎఫెక్ట్‌ : భారత్‌ కీలక నిర్ణయం)

ఈ నేపథ్యంలో బయట ప్రపంచానికి దూరంగా ప్రత్యేక కేంద్రంలో ఉన్న విద్యార్థులు ఒంటరితనంతో నిరాశగా భావించకుండా ఉత్సహంగా ఉన్నారు. అంతేకాకుండా ఆ విద్యార్ధులు మాస్కలు ధరించి పాటలకు నృత్యాలు కూడా చేశారు. ఈ వీడియోను ఎయిర్ ఇండియా ప్రతినిధి ధనంజయ్ కుమార్ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసిన బీజేపీనేత మేజర్ సురేంద్ర పూనియా స్పందిస్తూ.. ‘కరోనా వైరస్‌ హర్యానా సంగీతానికి నృత్యం చేస్తోంది. వుహాన్‌ నగరం నుంచి భారత్‌కి వచ్చిన విద్యార్థులను మ‌నేస‌ర్‌లోని ప్ర‌త్యేక కేంద్రంలో చూడటం సంతోషంగా ఉంది’ అని ట్విట్‌ చేశారు. అదేవిధంగా ‘చైనా నుంచి వచ్చిన విద్యార్థులు కరోనా వైరస్‌ గురించి భయపడటం లేదు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

మరిన్ని వార్తలు