పెరిగిన కరోనా కేసుల రికవరీ రేటు

11 May, 2020 18:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,213 కరోనా పాజిటివ్‌ కేసలు నమోదు కాగా, 97 మంది దేశవ్యాప్తంగా మరణించారు. అయితే భారతదేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య మాత్రం ఆశాజనకంగా ఉంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో కోలుకుంటున్న వారి శాతం 31.15శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 1559 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇ‍ప్పటి వరకు దేశం మొత్తం మీద 67,125 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 20,197 మంది కోలుకోగా, 2,206 మంది మరణించారు. ఇక దేశంలో ప్రస్తుతం 44,029 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. (ముగ్గురిలో ఒకరికి స్వస్థత)

కరోనా బాధితులు హాస్పటల్‌ నుంచి డిశార్జ్‌ అయ్యాక హోం క్వారంటైన్‌లో 10 రోజుల పాటు ఉండాలి ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. అప్పటికి వారిలో ఎటువంటి లక్షణాలు లేకపోతే క్వారంటైన్‌ నుంచి బయటకి రావొచ్చని పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన  కరోనా డిశార్జ్‌ పాలసీలో ఈ నిబంధనలు ఉన్నాయన్నారు.  హోం ఐసోలేషన్‌ పూర్తయ్యాక లక్షణాలు లేకుంటే పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. అదేవిధంగా స్వల్ప లక్షణాలు ఉన్న కారణంగా హాస్సటల్‌లో చేరిన వారిని కూడా ఆసుపత్రిలో ఉంచి మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే డిశార్జ్‌ చేస్తామని వారికి డిశార్జ్‌ చేసే సమయంలో కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే వారు 10 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంటే మంచిదని పేర్కొన్నారు.  విదేశాల్లో చిక్కుకున్న 4 వేల మందిని స్వదేశానికి తీసుకొచ్చామని తెలిపారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కారణంగా చిక్కుకుపోయిన  5 లక్షల మంది వలస కార్మికులను రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నామని వెల్లడించారు. (72 గంటలపాటు పార్శిల్స్ తాకొద్దు!)

మరిన్ని వార్తలు