టాయిలెట్‌ కాలేజ్.. రికార్డు శిక్షణ

3 Oct, 2019 16:38 IST|Sakshi

న్యూఢిల్లీ: పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇవ్వడంలో ఓ కళాశాల చరిత్ర సృష్టించింది. మహారాష్ట్రలోని హార్పిక్‌ వరల్డ్‌ టాయిలెట్‌ కళాశాల ఏకంగా 3200మందికి  శిక్షణ ఇచ్చింది. భారత దేశ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ కళాశాల పారిశుధ్య కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇస్తునే ప్రమాదాలకు గురవ్వకుండా అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యాలుగా కళాశాల మెనెజ్‌మెంట్‌ చెబుతుంది. ఈ కళాశాల ఆగస్టు 2018న స్థాపించబడింది. భారత్‌లో ఇదే మొదటి టాయిలెట్‌ కాలేజ్.

బ్రిటన్‌కు చెందిన కన్య్జూమర్‌ గూడ్స్‌ మేజర్‌ రెకిట్‌ బెంకీసర్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ సందర్భంగా బెంకీసర్‌ మాట్లాడుతూ.. తమ కళాశాల పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇస్తునే వంద శాతం స్థిరమైన ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో శిక్షణ పొందిన కార్మికులు జాతీయ, ప్రాంతీయ సంస్థలలో ఉపాధి పొందారని ఆయన గుర్తుచేశారు. ఈ కాలేజీలో 25నుంచి30 మంది కార్మికులను ఒక బ్యాచ్‌గా తీసుకుంటారు. రోజుకు మూడు గంటల పాటు శిక్షణ ఇస్తారు. ఇందులో, మహిళా కార్మికులకు మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు గంటల వరకు, పురుష కార్మికులకు  నాలుగు నుంచి ఏడు గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్లు కంపెనీ వారు తెలిపారు. అయితే, పారిశుధ్య కార్మికులకు అపారమైన నైపుణ్యాన్ని అందించామని, వారు సమాజానికి ఎంతో మేలు చేస్తారని కంపెనీ ఆశాభవాన్ని వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు