180 మంది ప్రయాణీకులతో సేఫ్‌ ల్యాండింగ్‌..

16 Dec, 2019 18:57 IST|Sakshi

కోల్‌కతా : 180 మంది ప్రయాణీకులతో సిలిగురి నుంచి కోల్‌కతా బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్యలతో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సిలిగురిలోని బదోగ్రా ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు టేకాఫ్‌ తీసుకున్న విమానం ఇంజన్‌లో సమస్యలు తలెత్తడంతో కొద్దిసేపటికే వెనుదిరిగి సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఎయిర్‌బస్‌ ఏ 320 నియోలో తరచూ ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సమస్యతో ఇదే ఇంజన్‌ను వాడుతున్న పలు ఇండిగో విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అవడం పరిపాటిగా మారింది. దీంతో వచ్చే ఏడాది జనవరి 31 నాటికి తన ఎయిర్‌బస్‌ ఏ 320 నియో విమానాల ఇంజన్లను సవరించాలని పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ఇండిగోను ఆదేశించింది.

మరిన్ని వార్తలు