బ్రిడ్జిని ఢీకొట్టిన విమానం

6 May, 2017 17:52 IST|Sakshi
బ్రిడ్జిని ఢీకొట్టిన విమానం

జైపూర్‌: ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. జైపూర్‌లోని సంగనర్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అయిన తర్వాత పార్క్‌ చేసే క్రమంలో ఎయిరో బ్రిడ్జిని ఢీకొట్టింది. విమానం రెక్క ఒకటి బ్రిడ్జికి తగలడంతో స్వల్పంగా అది దెబ్బతిన్నది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.

ఢిల్లీ నుంచి శనివారం ఉదయం 174మంది ప్రయాణీకులతో బయలుదేరి వచ్చిన 6ఈ-962 ఇండిగో విమానం తొలుత విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. ఆ తర్వాత దానిని పార్కింక్‌ చేసేందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగిందని, దర్యాప్తునకు ఆదేశించామని ఎయిర్‌ పోర్ట్‌ డైరెక్టర్‌ ఎం పీ బన్సల్‌ తెలిపారు. తమ అంతర్గత భద్రతా వ్యవహారాలు చూసే బృందంతో విచారణ చేయిస్తామని ఇండిగో తెలిపింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు