ఇండిగో విమాన సేవల్లో జాప్యం

4 Nov, 2019 12:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమ నెట్‌వర్క్‌లో సిస్టమ్స్‌ డౌన్‌ కావడంతో విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంటుందని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. పలు విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలతో తమ ఆపరేషన్స్‌లో ఆలస్యం జరగవచ్చని త్వరలోనే సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. తమ ప్రయాణీకులకు తలెత్తిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నారు. ప్రయాణీకులు సంస్థ సోషల్‌ మీడియా వేదికలపై తమ కస్టమర్‌ కేర్‌ సిబ్బందిని సంప్రదించి అవసరమైన సమాచారం పొందవచ్చని పేర్కొంది. ముంబైలో ఇప్పటికి తొమ్మిది విమానాల ఆపరేషన్స్‌లో జాప్యం నెలకొందని తెలిపింది. ఈ రోజంతా సర్వర్‌ డౌన్‌ కారణంగా మరింత జాప్యం చోటుచేసుకోవచ్చని ప్రయాణీకులు గమనించాలని కోరింది.

>
మరిన్ని వార్తలు