యమధర్మారాజుగా మారిన పోలీసు కానిస్టేబుల్‌

18 Apr, 2020 10:22 IST|Sakshi

భోపాల్‌: లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంగిస్తూ కొంతమంది ప్రజలు ఇళ్లుదాటి రోడ్లపైకి వస్తున్నారు. అటువంటి వారిని కట్టడి చేసేందుకు ఓ పోలీసు కానిస్టేబుల్‌ వినూత్నంగా ఆలోచించాడు. యమధర్మరాజు అవతారం ఎత్తి కరోనాపై అవగాహన చర్యలు చేపడుతున్న ఆయన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన పోలీసులు కానీస్టేబుల్‌ జవహార్‌ సింగ్‌ బ్లాక్‌డ్రెస్‌‌, బంగారు నగలు, గధ పట్టుకుని నగర వీధుల్లో తిరుగతూ మహమ్మారి పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాడు. లాక్‌డౌన్‌లో ఎవరూ ఇళ్లు దాటి బయటకు రావోద్దని.. ఒకవేళ వస్తే కఠిన చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరిస్తున్నాడు. (పోలీసులే రియల్‌ హీరోలు)

ప్రజలను మహమ్మారి పట్ల అప్రమత్తం చేసేందుకు.. కానిస్టేబుల్‌ చేసిన ఈ వినూత్న ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసల జట్లు కురిపిస్తున్నారు. కాగా ఇండోర్‌లో శుక్రవారం ఒక్కరోజే 50 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 892కు చేరినట్లు ఇండోర్‌ చీఫ్‌ మెడికల్‌, హెల్త్‌ ఆఫిసర్‌ ప్రవీణ్‌ జాడియా వెల్లడించారు. ఇక మధ్యప్రదేశ్‌లో కరోనాతో మరణించిన  69 కేసులతో కలిపి మొత్తం 1,310 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. (లాక్‌డౌన్‌లో పెళ్లి... లాక్‌అప్‌లో జంట!)

మరిన్ని వార్తలు