దేశంలో అత్యంత పరిశుభ్ర నగరం ఇదే..

31 Dec, 2019 18:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్‌ నగరం వరుసగా నాలుగోసారి ముందువరుసలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన క్లీన్‌లినెస్‌ సర్వేలో ఇండోర్‌ టాప్‌ వన్‌ సిటీగా నిలిచింది. ఇదే రాష్ట్రానికి చెందిన భోపాల్‌ రెండో స్ధానంలో నిలవగా, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ రెండో క్వార్టర్‌లో(ఏప్రిల్‌-జూన్‌) ద్వితీయ స్ధానంలో నిలిచింది. ఇక ఇదే క్వార్టర్‌లో సూరత్‌ (గుజరాత్‌) మూడో స్ధానంలో, రెండో క్వార్టర్‌లో నవీ ముంబై (మహారాష్ట్ర)లు మూడో స్ధానం దక్కించుకున్నాయి. 10 లక్షల మంది కన్నా తక్కువ జనాభా కలిగిన నగరాల విభాగంలో జార్ఖండ్‌కు చెందిన జంషెడ్‌పూర్‌ తొలిస్ధానంలో నిలిచిందని క్లీన్‌లినెస్‌ సర్వే వెల్లడించింది.

మరిన్ని వార్తలు