‘చిదంబరం అరెస్టు సంతోషకరం’

29 Aug, 2019 15:42 IST|Sakshi

ముంబై: ఐఎన్‌ఎక్స్‌ కుంభకోణంలో కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్ట్‌పై ఇంద్రాణీ ముఖర్జీ స్పందించారు. అనూహ్యంగా ఐఎన్‌ఎక్స్‌ కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ ముఖర్జీ గురువారం ముంబై కోర్టు వెలుపల మాట్లాడుతూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్ట్ అవటం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐన్‌ఎక్స్‌ మీడియా సంస్థను స్థాపించిన ఇంద్రాణి ముఖర్జీ ఆమె భర్త పీటర్‌ కేసులో అప్రూవర్లుగా మారడంతో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. భారీ హైడ్రామాల మధ్య గత గురువారం చిదంబరాన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. కస్టడీలో ఉన్న చిదంబరం ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా.. కోర్టులో అతనికి ఎదురుదెబ్బ తగిలింది.

కాగా, 2017లో ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ముందు ఇంద్రాణి ఇచ్చిన వాంగ్మూల‌మే చిదంబ‌రం అరెస్టుకు దారి తీసింది. విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం కోరినట్టుగా ఇంద్రాణీ ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ముందు పేర్కొన్నారు. ఆ సంవత్సరంలో ఐఎన్‌ఎక్స్‌ సంస్థకు రూ.305 కోట్ల విదేశీ నిధులు వచ్చాయని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు