రాత్రిపూట రోడ్డుపై అంబాడుతూ పాప.. వైరల్‌ వీడియో

9 Sep, 2019 15:46 IST|Sakshi

రాత్రి సమయంలో వేగంగా వెళ్తున్న జీప్ నుంచి 11నెలల పాప ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది. జీప్‌లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించలేదు. ముందుకు వెళ్లిపోయారు. వేగంగా వెళ్తున్న వాహనం నుంచి బయటపడినా చిన్నారికి మాత్రం ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. వాహనం వెళ్లిపోయిన తర్వాత రహదారిపై పాప అటు-ఇటు పాకుతూ కనిపించింది. రాత్రి సమయంలో పాప రోడ్డుపై అంబాడుతూ కనిపించడంతో స్థానికులు గుర్తించి కాపాడారు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చారు. కేరళలోని మున్నార్ ఇడుక్కి ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అక్కడే రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా