జూన్‌లో అంచనాలకంటే మెరుగ్గా ద్రవ్యోల్బణం

15 Jul, 2013 14:56 IST|Sakshi

న్యూఢిల్లీ : జూన్‌ నెలలో ద్రవ్యోల్బణం మార్కెట్ అంచనాల కంటే కొంత మెరుగ్గా వచ్చింది. 4.86 శాతంగా నమోదైంది. 5 శాతంగా వస్తుందని మార్కెట్‌ వర్గాలు భావించాయి. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. రూపాయి పతనం ప్రభావం ఇంకా మార్కెట్లో పూర్తి స్థాయిలో కనిపించలేదని మున్ముందు ద్రవ్యోల్బణం మళ్లీ 5 శాతం పైకి రావొచ్చని భావిస్తున్నారు.

మరోవైపు ఆహార ద్రవ్యోల్బణం 9.74 శాతంగా నమోదైంది. అంతకు ముందు నెలలో 8.2 శాతంగా ఉంది. రుతుపవనాలు చురుగ్గా ఉండటం, వర్షాలు జోరుగా కురుస్తుండటంతో మున్ముందు కూరగాయలు, పండ్ల ధరలు తగ్గుతాయని  అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు