‘నక్కీరన్‌’ గోపాల్‌పై కేసు వెనక్కి తీసుకోవాలి

11 Oct, 2018 05:26 IST|Sakshi

న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ను అగౌరవపరిచారనే కారణంతో ‘నక్కీరన్‌’ వారపత్రిక వ్యవస్థాపక సంపాదకులు నక్కీరన్‌ గోపాల్‌ను అరెస్ట్‌ చేయడాన్ని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) ఖండించింది. భారత రాష్ట్రపతి, గవర్నర్‌లను కించపరుస్తూ, వారి బాధ్యతలకు తీవ్ర ఆటంకం కలిగించే వారిని శిక్షించేందుకు వాడే ఐపీసీ సెక్షన్‌ 124ను నక్కీరన్‌ గోపాల్‌పై మోపడం అన్యాయమని ఐఎన్‌ఎస్‌ అధ్యక్షులు జయంత్‌ మమెన్‌ మాథ్యూ వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను గౌరవించాలని ఆయన కోరారు. ఈ విషయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. నక్కీరన్‌ గోపాల్‌పై, వారపత్రిక సిబ్బందిపై దాఖలైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సర్కారుకు విజ్ఞప్తిచేశారు. 

మరిన్ని వార్తలు