లౌడ్‌ స్పీకర్లను కట్టడి చేయండి

20 Sep, 2017 18:59 IST|Sakshi
లౌడ్‌ స్పీకర్లను కట్టడి చేయండి

సాక్షి, న్యూఢిల్లీ : ఆజా సమయాల్లో మసీదుల్లోని మైకుల నుంచి వచ్చే ధ్వని తీవ్రత స్థాయిలను గుర్తించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) బుధవారం ఆదేశించింది. మసీదుల్లోని లౌడ్‌ స్పీకర్ల నుంచి పరిమితికి మించి శబ్దాలు వస్తుంటే.. తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఎస్‌.కుమార్‌ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ పొల్యూషనల్‌ కంట్రోల్‌ బోర్డును ఆదేశించారు.

పరిమితులకు లోబడి మాత్రమే లౌడ్‌ స్పీకర్లు వాడుతున్నట్లు 10 మసీదులు మాత్రమే స్పష్టం చేశాయని చెప్పారు. ధ్వనికి సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చిన మసీదులు మినహా మిగిలిన అన్ని మసీదులను తనిఖీ చేయాలని డీపీసీసీని ఆయన ఆదేశించారు. ఎక్కడైనా అధికంగా ధ్వని వస్తున్నట్లు తేలితే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 

మరిన్ని వార్తలు