ఈ- మెయిల్ ద్వారా విద్యార్ధుల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

23 Jun, 2020 15:37 IST|Sakshi

బెంగుళూరు :  క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే ప‌దోత‌ర‌గ‌తి స‌హా వివిధ ప‌రీక్ష‌లను ర‌ద్దు చేస్తూ ఆయా రాష్ర్ట ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కర్ణాట‌క‌కు చెందిన ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ మాత్రం ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ని విడుద‌ల చేసింది. సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకావాలంటూ విద్యార్థుల‌కు ఈ- మెయిల్స్  పంపించింది.  ఇత‌ర రాష్ర్టాల నుంచి వ‌చ్చేవారు ప్ర‌భుత్వం ఆదేశించిన 14 రోజుల క్వారంటైన్ నిబంధ‌న‌ల్ని పాటించాల‌ని పేర్కొంది. దీంతో క‌రోనా స‌మ‌యంలో ప‌రీక్షలు ఎలా నిర్వ‌హిస్తారంటూ త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇత‌ర రాష్ర్టాల  నుంచి వ‌చ్చేవారికి క్వారంటైన్ నిబంధ‌న‌ల‌తో పాటు వ‌స‌తి క‌ల్ప‌న‌కు చాలా ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని పేర్కొన్నారు. కాబ‌ట్టి తాత్కాలికంగా ప‌రీక్ష‌లను వాయిదా వేయాలంటూ త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.  (కంపెనీ ఉద్యోగుల‌కు క‌రోనా.. బాధితులు ప‌రార్ )

సాధార‌ణంగా అయితే జూన్ చివ‌రి వారంలో ప‌రీక్ష‌లు జ‌ర‌గాలి. కానీ క‌రోనా కార‌ణంగా ఆగ‌స్టు 3 నుంచి 21 మ‌ధ్య‌కాలంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామంటూ స‌దరు ఇన్‌స్టిట్యూట్ విద్యార్థుల‌కు ఈ -మెయిల్ ద్వారా షెడ్యూల్ పంపింది. అంతేకాకుండా రాష్ర్టంలో అంత‌కంత‌కూ పెరుగుతున్న కేసుల దృష్ట్యా అత్య‌ధిక కేసులు వెలుగుచూస్తున్న కోవిడ్ కేంద్రాల‌ను గుర్తించి వాటి స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను మూసివేయాల‌ని ముఖ్య‌మంత్రి య‌డియూరప్ప ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ల‌క్ష‌ణాలు క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రికి కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. (కర్ణాటక ప్రభుత్వానికి సూచించిన మాజీ సీఎమ్‌ )

మరిన్ని వార్తలు