ఇన్సులిన్‌ ధరలకు కళ్లెం

14 Nov, 2019 02:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా ఇన్సులిన్‌ ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం నెలవారీ ఇన్సులిన్‌ కోర్సుకు దాదాపు రూ.3వేల వరకు ఖర్చు అవుతుండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆ వ్యయం దాదాపు సగానికి తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటివరకు మూడు నాలుగు కంపెనీలు మాత్రమే ఇన్సులిన్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. వాటి గుత్తాధిపత్యం కారణంగా ధరలు అత్యధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్సులిన్‌ ప్రీక్వాలిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ కింద బుధవారం కీలక నిర్ణయ తీసుకుంది. దీంతో ఇన్సులిన్‌ను ఇకపై ఏ సంస్థ అయినా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఏర్పడింది. ఫలితంగా సంస్థల మధ్య పోటీ పెరిగి ఇన్సులిన్‌ కోర్సు నెలవారీ ఖర్చు రూ.600 నుంచి రూ.1500 వరకు తగ్గే అవకాశం ఉంటుందని నిమ్స్‌ ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ గంగాధర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు