ఐబీ, రా కొత్త చీఫ్ల నియామకం

17 Dec, 2016 20:19 IST|Sakshi

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పలు కీలక పదవులకు అధిపతులను నియమించింది. రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్(రా) చీఫ్గా అనిల్ దస్మానా, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్గా రాజీవ్ జైన్ను ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

రా చీఫ్గా నియమించిన అనిల్ దస్మానా మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అధికారి. ఐబీ చీఫ్గా నియమించిన రాజీవ్ జైన్ జార్ఖండ్కు చెందిన ఐపీఎస్ అధికారి. వీరిద్దరు ఇప్పటికే పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు