విలీనంపై నేటి నుంచి చర్చలు

20 Apr, 2017 08:25 IST|Sakshi
విలీనంపై నేటి నుంచి చర్చలు

- అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు
- పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని దినకరన్‌ ప్రకటన


సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ దినకరన్‌పై వేటుపడిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దినకరన్, ఆయన కుటుం బ సభ్యులను పార్టీ, ప్రభుత్వ కార్యకలా పాల కు దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి జయకుమార్‌ మంగళవారం రాత్రి ప్రకటించిన నేపథ్యంలో అన్నాడీఎంకే లోని వైరి వర్గాల విలీనంపై నేటి నుంచి చర్చలు ప్రారంభం కానున్నాయి. అధికార వర్గానికి సీఎం ఎడపాడి పళనిస్వామి, మరో వర్గానికి మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సారథ్యం వహిస్తూ చర్చలకు శ్రీకారం చుట్టనున్నారు.

అయితే ఇరువురు నేతలు ముఖాముఖిగా చర్చలు జరపకుండా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. చర్చలు ఫలప్రదమైన తరు వాత ఎడపాడి, పన్నీర్‌ కలుసుకునేలా నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా పన్నీర్‌ సెల్వం, ఉప ముఖ్యమంత్రిగా ఎడపాడి పళని స్వామి అనే కోణంలో చర్చలు ఆరంభం కానున్నట్లు సమాచారం. అయితే ప్రధాన కార్యదర్శి పదవి ఎవరికి అనే అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

వాంటెడ్‌ దినకరన్‌
రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునేందుకు ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్‌ విదేశాలకు పారిపోకుండా ఢిల్లీ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. దినకరన్‌ పేరును ‘వాంటెడ్‌’ (పోలీసులు గాలిస్తున్న వ్య క్తుల జాబితా) జాబితాలో చేర్చారు. ఢిల్లీ పోలీసులు టీటీవీ దినకరన్‌కు బుధ వారం రాత్రి 10.45 గంటల సమయంలో అతని ఇంటికి వెళ్లి సమన్లు జారీ చేశారు. ఆ సమయంలో అక్కడున్న మైలాపూర్‌కు చెందిన దినకరన్‌ మద్దతుదారుడు రవిచంద్రన్‌ ఒంటి పై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నిం చగా అక్కడున్న వారు అతన్ని అడ్డుకున్నారు.   

పార్టీకి దూరంపై బాధలేదు: దినకరన్, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి
క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండా లని ఆదేశిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై నాకు బాధలేదు. పార్టీ చీలిపోకూడదన్నదే నా అభిమతం. నేను దూరంగా ఉండడం పార్టీకి మేలని భావిస్తే అందుకు కట్టుబడి ఉంటా.

కోమాలో తమిళ సర్కార్‌: స్టాలిన్, ప్రతిపక్ష నేత
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కోమాలో ఉంది. తమిళనాట రైతు సమస్యలు, నీటి ఎద్దడి తాండవం చేస్తుంటే, పాలకులు వారి స్వలాభాన్ని చూసుకునే పనిలో పడ్డారు. అందుకే ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర చాలని స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించాం.

ధర్మయుద్ధంలో తొలి విజయం
ఎంజీఆర్‌ స్థాపించిన అన్నాడీఎం కేను జయలలిత 29 ఏళ్లపాటు జయప్ర దంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల పార్టీగా తీర్చిదిద్దారు. అమ్మ మరణం తరువాత పార్టీని శశికళ కుటుంబ సభ్యుల కబంధహస్తాల నుంచి పార్టీని కాపాడుకునేందుకే ధర్మయుద్ధం సాగిం చాను. రెండువర్గాలూ ఏకమయ్యే దిశగా సాగుతున్న ఈ పయనం మా ధర్మయు ద్ధానికి లభించిన తొలి విజయం.
    – పన్నీర్‌సెల్వం, మాజీ ముఖ్యమంత్రి

మరిన్ని వార్తలు