ఇంటర్నెట్, నైట్ లైఫ్, న్యూడిటీ..!

6 Jun, 2016 13:16 IST|Sakshi
ఇంటర్నెట్, నైట్ లైఫ్, న్యూడిటీ..!

సముద్ర తీరంలో తీరొక్క రీతిలో ఎంజాయ్ చేస్తారు జనం. అప్పుడు మొబైల్ గిబైల్ పక్కనపెట్టి ఆనందంలో మునిగితేలుతారు. అయితే భారతీయులు మాత్రం అలా ఎంజాయ్ మెంట్ లో పూర్తిగా మునిగిపోవడానికి ఇష్టపడట్లేదు. ఆ..ఆనందాన్ని నలుగురితో షేర్ చేసుకోవాలనుకుంటారు. అందుకే బీచ్ టూర్లలో సైతం ఇంటర్నెట్ ను వదిలిపెట్టట్లేదు. నైట్ లైఫ్, న్యూడిటీ కూడా భారతీయ పర్యాటకుల ప్రాధాన్యతల్లో ముఖ్యమైనవి. ప్రఖ్యాత ట్రావెల్ పోర్టల్ ఎక్స్ పీడియా తాజాగా 12 వేల మందితో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

24 దేశాల్లో పర్యాటకులను పరిశీలించి, ప్రశ్నలు వేసి రూపొందించిన ఎక్స్ పీడియా ఈ రిపోర్టు తయారు చేసినట్లు చెబుతోంది. దాని ప్రకారం తీర ప్రాంతాలకు టూర్లకు వెళ్లేవారిలో థాయిలాండ్ వాసుల(82 శాతం) తర్వాతి స్థానం భారతీయులదే. ఇండియన్ టూరిస్టులలో 81 శాతం మంది బీచ్ లలో గడిపేందుకు ఇష్టపడుతున్నారట. వారిలో 39 శాతం మంది నైట్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయగలిగే ప్రాంతాలను ఎంచుకుంటామనగా, బీచ్ లలో న్యూడిటీని ఎంజాయ్ చేస్తామని 24 శాతం మంది చెప్పుకొచ్చారు.

ప్రతీ నలుగురు ఇండియన్ టూరిస్టుల్లో ఒకరు హాలీడేస్ లో కూడా ఆఫీస్ ఈ మెయిల్స్ కు సమాధానాలివ్వడం, 24 గంటలూ ట్యాబ్ ను క్యారీ చేయడం వంటివి తప్పనిసరిగా భావిస్తారట. అలానే ప్రతి 10 మందిలో నలుగురు బీచ్ లలో కూడా వైఫై అందుబాటులో ఉండాలని, తద్వారా ఎప్పటికప్పుడు స్టేటస్ పోస్ట్ చేసుకునే వీలుంటుందని కోరుకుంటున్నారట. భలే ఉందికదూ.. భారతీయ టూరిస్టుల వ్యవహారం!

మరిన్ని వార్తలు