గుజరాత్ సరికొత్త నిర్ణయం

13 Oct, 2016 19:04 IST|Sakshi
గుజరాత్ సరికొత్త నిర్ణయం

గాంధీనగర్: పంచాయతీ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్ష ప్రశ్నాపత్రం బయటకు రాకుండా నివారించేందుకు గుజరాత్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16న పంచాయత్ సేవా మండల్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది.

పరీక్షా సమయంలో నాలుగు గంటల పాటు ఇంటర్నెట్ పనిచేయదని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. టెక్నాలజీని ఉపయోగించుకుని పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  పంచాయత్ సేవా మండల్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని వార్తలు