నిత్యానందపై ఇంటర్‌పోల్‌ నోటీస్‌

23 Jan, 2020 05:01 IST|Sakshi

అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై అంతర్జాతీయ పోలీస్‌ సంస్థ ఇంటర్‌పోల్‌ ఇటీవలే బ్లూకార్నర్‌ నోటీస్‌ జారీ చేసింది. గుజరాత్‌లో కొంతమంది పిల్లలను అక్రమంగా నిర్బంధించారని కూడా నిత్యానందపై ఆరోపణలు ఉండటం తెలిసిందే. బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేస్తే ఇంటర్‌పోల్‌ సభ్య దేశాలు ఆ వ్యక్తి ఆచూకీ, జరిగిన నేరానికి నిందితుడికి మధ్య ఉన్న సంబంధాలపై అదనపు సమాచారం సేకరిస్తాయి.

నిత్యానంద ఆనుపానులు తెలుసుకోవాలన్న గుజరాత్‌ పోలీసుల అభ్యర్థనకు స్పందించిన సీబీఐ ఆ మేరకు ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తిని పంపిందని అహ్మదాబాద్‌ డీఎస్పీ కె.టి.కమారియా తెలిపారు. నిత్యానందను అరెస్ట్‌ చేసేందుకు అవసరమైన రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ కూడా జారీ చేయించేందుకు ప్రయత్ని స్తున్నట్లు ఆయన చెప్పారు. అహ్మదాబాద్‌లోని నిత్యా నంద ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోవడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఓ వైపు వెదుకుతుండగానే..  నిత్యానంద ఈక్వెడార్‌ సమీపంలోని ఓ దీవిలో కైలాస అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు డిసెంబర్‌లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు