క్యూ3లో వండర్‌లా లాభం పైపైకి

26 Jan, 2019 05:37 IST|Sakshi

బెంగళూరు: వినోదరంగంలోని వండర్‌లా హాలిడేస్‌ లిమిటెడ్‌ సంస్థ డిసెంబర్‌ 31వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి రూ.78.63 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే ఇది 81.34 శాతం ఎక్కువని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో పన్నులు మినహాయించి వచ్చిన లాభం రూ.6.54 కోట్లతో పోలిస్తే ఈ సారి రూ.14.51 కోట్లకు చేరి 122 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. బెంగళూరు, హైదరాబాద్‌ వండర్‌లా పార్కుల్లో సందర్శకుల సంఖ్య వరుసగా 23 శాతం, 12 శాతం పెరిగిందని  సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జార్జి జోసెఫ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు