భారత్‌లో 31వ కరోనా కేసు నమోదు

6 Mar, 2020 16:38 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షేఖోలెస్లాం కరోనా వ్యాధి బారీన పడి గురువారం రాత్రి మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. మరోవైపు భారత్‌లో మరో కరోనా కేసు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఢిల్లీకి చెందిన  వ్యక్తికి నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలడంతో  ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆ వ్యక్తి  థాయ్‌లాండ్‌ నుంచి మలేషియా వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. దీంతో ఇప్పటివరకు భారత్‌లో 31 కరోనా కేసులు నమోదయ్యాయి.  కాగా కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌కు సంబంధించి ఇరాన్‌లో మొదటి క్లినిక్‌ను ఏర్పాటు చేయడానికి భారత వైద్య బృందం కోమ్‌ సిటీకి పంపిచనున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 85 దేశాలకు కరోనా వ్యాప్తి చెందింది. 3350 మందికి పైగా కరోనా బారీన పడి మృతి చెందగా, దాదాపు 97500 కరోనా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
(కరోనా ఎఫెక్ట్‌ : గూగుల్‌ వేటలో అదే టాప్‌)


 

>
మరిన్ని వార్తలు