రైల్‌లో సెలూన్‌ కోచ్‌

31 Mar, 2018 15:39 IST|Sakshi

ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్(ఐఆర్‌సీటీసీ) సరికొత్త ఆలోచనలతో ముందుకు దూసుకెళ్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐఆర్‌సీటీసీ కూడా వినూత్న ఐడియాలతో అడుగులేస్తోంది. రైళ్లలో అదనంగా బోగీని ఏర్పాటు చేసి, అందులో సెలూన్‌షాప్‌లను కూడా అమర్చినట్లు ఐఆర్‌సీటీసీ ట్విటర్‌ ద్వారా తెలిపింది. ఈ సదుపాయాన్ని పాత ఢిల్లీ రైల్వేస్టేషన్‌ నుంచి కట్రా వరకు నడిచే రైళ్లలో శుక్రవారం ప్రారంభించినట్టు పేర్కొంది.

ఈ బోగీల్లో కేవలం సెలూన్‌ షాప్‌లే కాకుండా, డబుల్‌బెడ్‌ రూమ్‌లు, డైనింగ్‌ రూం, కిచెన్‌ కూడా ఉంటుంది. దీంతో ప్రయాణికులకు నడిచే ఇళ్లు మాదిరి ఫీలింగ్‌ కలుగుతుందని ఐఆర్‌సీటీసీ చెప్పింది. ఈ సదుపాయాలను ఏర్పాటు చేసిన మొదట్లో వీటిల్లో రైల్వే అధికారులు మాత్రమే ప్రయాణించేవారు. అయితే జనవరిలో జరిగిన రైల్వే సమావేశం అనంతరం వీటిని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఒక్కో బోగీకి దాదాపు రెండు లక్షలు ఖర్చు అవుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు