భూస్థిర కక్ష్యలోకి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఐ 

17 Apr, 2018 03:24 IST|Sakshi
ఐఆర్‌ఎన్‌ఎస్‌ ఎస్‌–1ఐ (ఊహా చిత్రం)

శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఐ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాన్ని ఈ నెల 12న సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 ఉపగ్రహ వాహకనౌక ద్వారా రోదసిలోకి పంపిన విషయం తెలిసిందే. బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు దశలుగా మండించి ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో పెరిజీ (భూమికి దగ్గరగా) 35,462 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,737 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి  ప్రవేశపెట్టారు.

ప్రయోగం జరిగిన రోజున ఉపగ్రహాన్ని పెరిజీ 284 కిలోమీటర్లు, అపోజి 20,650 కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం విదితమే. అనంతరం మూడు విడతలుగా కక్ష్యదూరాన్ని పెంచిన శాస్త్రవేత్తలు.. ఆదివారం రాత్రి నాలుగో విడత కక్ష్య దూరాన్ని పెంచి ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం అధికారికంగా ప్రకటించారు. 

మరిన్ని వార్తలు