-

దేశాభివృద్ధిలో వచ్చే పదేళ్లు కీలకం: వెంకయ్య

24 Sep, 2014 01:52 IST|Sakshi
దేశాభివృద్ధిలో వచ్చే పదేళ్లు కీలకం: వెంకయ్య

న్యూఢిల్లీ: భారత దేశ ప్రగతి కథను తిరిగి లిఖించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో వచ్చే పదేళ్ల కాలం కీలకం కానుందని చెప్పారు. మంగళవారం ఇక్కడ అఖిల భారత మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) 41వ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. ‘మారుతున్న కాలం-భారత ప్రగతి పునరుద్ధరణ’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. దేశ పూర్వపు వైభవం తిరిగి తెచ్చేందుకు వాణిజ్య దృక్పథంలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.
 పట్టణాభివృద్ధికి జపాన్ సాయం: దేశంలో పట్టణాలు సహా వివిధ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి జపాన్ ఆసక్తి చూపుతున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.

దేశంలోని వివిధ నగరాల్లో మల్టీమోడల్ రవాణా వ్యవస్థ పరిష్కారాలను చూపేందుకు ఆసక్తి చూపుతోందని చెప్పారు. జపాన్ మౌలిక వసతులు, రవాణా, పర్యాటక శాఖ మంత్రి అకిహిరో ఓతా సహా 20 మంది ఉన్నతాధికారుల బృందం మంగళవారం వెంకయ్యనాయుడితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడ మెట్రో రైలు మార్గాలకు జపాన్ సాయాన్ని కోరారు.
 
 

మరిన్ని వార్తలు