'వారికి సైన్యంతోనే సమాధానం చెప్పాలి'

21 Apr, 2016 19:53 IST|Sakshi
'వారికి సైన్యంతోనే సమాధానం చెప్పాలి'
అగర్తలా: ఆధ్యాత్మిక గురు రవి శంకర్ గురూజీ(59)  ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద సంస్థతో శాంతి కోసం  చర్చించాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆయన ప్రతిపాదనకు స్పందిస్తూ ఐఎస్ తల లేకుండా మొండెం మాత్రమే ఉన్న ఓ మనిషి ఫోటోను పంపింది.
 
'నేను శాంతికోసం వారితో చర్చించాలనుకున్నాను. కానీ వారు తల లేని మొండెం గల మనిషి ఫోటోను నాకు పంపడంతో నా ప్రతిపాదనలను విరమించుకున్నాను' అని రవిశంకర్ తెలిపారు. వారికి శాంతి చర్చలు ఇష్టం లేదని  సైన్యంతోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. త్రిపుర పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి విలసిల్లాలని అందుకోసం వివిధ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు.
 
ఈశాన్య ప్రాంతంలోని ఉగ్రవాదులు ఆయుధాలు వదిలి ప్రభుత్వంతో చర్చలు జరపాలని  రవిశంకర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఘర్షణలేని ఒకరి భావాలను మరొకరు గౌరవించుకునే సంస్కృతి రావాలని  ఆకాక్షించారు. యమునా నదీ తీరంలో ప్రకృతిని ధ్వంసం చేసినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కు రూ.5 కోట్లు ఫైన్ విధించడంపై స్పందించిన రవిశంకర్ ఇది రాజకీయ ప్రేరితమైనదిగా అభివర్ణించారు.
మరిన్ని వార్తలు