ఇషా అంబానీ నిశ్చితార్థం అయిపోయింది..

6 May, 2018 16:34 IST|Sakshi
ఆనంద్‌ పిరామల్‌తో ఇషా అంబానీ

సాక్షి, ముంబై : భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం అయిపోయింది. పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత అజయ్‌ పిరామల్‌ తనయుడు ఆనంద్‌ పిరామల్‌, ఇషాలు మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం.

ఆనంద్‌, ఇషాలు స్నేహితులు. కొద్దిరోజుల క్రితం మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఆనంద్‌, ఇషాకు ప్రపోజ్‌ చేశారు. ఇషా కూడా అంగీకారం తెలపడంతో అక్కడే ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలకు విషయం చెప్పారు. కాగా, ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం కంటే ముందే ఆనంద్‌, ఇషాల వివాహం జరుగుతుందని తెలిసింది.

అయితే, పెళ్లి తేదీ మాత్రం ఇంకా నిశ్చయం కాలేదు. ఆనంద్‌ హర్వాడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ చదివారు. భారత్‌లో పిరామల్‌ ఈ-స్వాస్థ్య, పిరామల్‌ రియాల్టీ అనే స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్నారు. రిలయన్స్ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో ఇషా సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు