ఇంద్రా గాంధీకి ఐఎస్‌ నేత విడాకులు..

12 Jan, 2020 18:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2014లో ఉగ్ర దాడికి కుట్ర పన్ని ఢిల్లీ పోలీసులచే అరెస్ట్‌ అయిన ఖాజా మొహిదీన్‌ తన భార్య ఇంద్రా గాంధీకి విడాకులిచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. మతపరమైన విభేదాలు తలెత్తడంతో మొహిదీన్‌ తన భార్యతో విడిపోయాడని ఢిల్లీ పోలీసుల దర్యాప్తు నివేదిక తెలిపింది. ఇంద్రా గాంధీని వివాహం చేసుకున్న ఐఎస్‌ నేత మొహిదీన్‌ ఆ తర్వాత ఐఎస్‌ భావజాలం ప్రభావంతో ఆమెకు విడాకులు ఇచ్చినట్టు నివేదిక తెలిపింది. 2014లో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉగ్ర దాడులకు కుట్ర పన్నారనే అభియోగంతో మొహిదీన్‌ సహా పలువురు అతడి అనుచరులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు 2004లో తమిళనాడులోని కడలూరు జిల్లాలో కొందరు దళితులను మొహిదీన్‌ బలవంతంగా మతమార్పిడికి గురిచేశారని కూడా దర్యాప్తు నివేదిక తెలిపింది. ఉగ్ర కుట్రతో పాటు పలు నేరారోపణలు ఎదుర్కొంటున్న మొహిదీన్‌ను 2017లో ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది.

మరిన్ని వార్తలు