తీర్పు వచ్చింది... కానీ ఇస్రో సైంటిస్టు విషాదం

18 Sep, 2018 21:06 IST|Sakshi

ఇస్రో గూఢచర్యం కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో భారీ ఊరట చెందిన  సైంటిస్టులు అంతలోనే విచారంలో మునిగిపోయారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత  వెలువడిన  సంతోషకరమైన వార్తను వినకుండానే  ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో మాజీ అంతరిక్ష శాస్త్రజ్ఞుడు కన్నుమూయడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.  తీర్పు వెలువడడానికి  కొన్ని  గంటలకు ముందే ఆరోపణలుఎదుర్కొన్న ఆరుగురు  శాస్త్రవేత్తల్లోఒకరైన  కె.చంద్రశేఖర్  (76) కోమాలోకి వెళ్ళిపోయారు.  చివరకు తప్పుడు కేసునుంచి విముక్తులమయ్యామన్న వార్త వినకుండానే కన్నుమూశారు. దీంతో  ఆయన సన్నిహితులు, ఇతర శాస్త్రజ్ఞులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత ఇస్రో మాజీ  సైంటిస్టులపై  గూఢచర్యం  ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలాగే తప్పుడు ఆరోపణలతో వారిని మానసింగా వేధించినందుకుగాను  50లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం  ఆదేశించింది. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న తీర్పు సెప్టెంబరు 14 ఉదయం 11 గంటలకు వచ్చింది. కానీ ఆ రోజు అప్పటికే ఆయన  నిర్జీవంగా పడివున్నారు. తీవ్ర అనారోగ్యం చికిత్స పొందుతున్న ఆయన  కొలంబియా ఆసియా హాస్పిటల్లో  ఆదివారం తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు  తెలిపారు.  

శుక్రవారం ఉదయం నుంచీ తీర్పు కోసం ఆయన ఆందోళనతో ఎదురుచూశారని చంద్రశేఖర్ భార్య హెచ్‌ఎంటీ జనరల్‌ మేనేజర్‌గా పనిచేసిన కె.జె.జయస్మా  కన్నీరు పెట్టుకున్నారు.  చంద్రశేఖర్‌ చివరి గంటల్లో అనుభవించిన బాధను, పడ్డ వేదనను ఆమె గుర్తుచేసుకున్నారు. తప్పుడు కేసులతో కేరళ పోలీసులు ఏం సాధించారని ఆమె ప్రశ్నించారు.  ఇన్నేళ్ల తమ క్షోభకు  ఎవరు బాధ్యులు, చంద్రశేఖర్‌ కరియర్‌ను మనశ్శాంతిని దూరం చేశారు. కేసు విచారణ సందర‍్భంగా  తమ ఇంటిపై దాడిచేసి  మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఎందుకు చేశారో ఇప్పటికైనా తమకు తెలియాలని విజయమ్మ డిమాండ్‌ చేశారు.  శుక్రవారం తీర్పు రానుందని ఆయన కు తెలుసు. అలాగే  కచ్చితంగా గెలుస్తారనే విశ్వాంస కూడా ఆయనకుంది. కానీ రెండు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న తీర్పు వార్తను వినడానికి ఆయన లేరని ఆమె వాపోయారు.  కాగా   చంద్రశేఖర్ 1992 నుండి రష్యా అంతరిక్ష సంస్థ గ్లవ్కోస్మోస్క్‌కు  భారత ప్రతినిధిగా పనిచేశారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. 

చదవండి: ఇస్రో శాస్త్రవేత్తకు 50 లక్షల పరిహారం

మరిన్ని వార్తలు