నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ44

25 Jan, 2019 00:01 IST|Sakshi

సాక్షి​, శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పీఎస్‌ఎల్‌వీ-సీ44 రాకెట్‌ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. గురువారం రాత్రి 11 గంటల 37 నిమిషాలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ44 కక్ష్యలోకి తీసుకెళ్లింది. తమిళనాడుకు చెందిన విద్యార్థులు రూపొందించిన కలాంశాట్‌తో పాటు మైక్రోశాట్‌ ఉపగ్రహాలను కూడా నిగింలోకి పంపారు. మైక్రోశాట్‌ ఉపగ్రహాలు దేశ రక్షణ రంగానికి  సమాచారాన్ని అందించనుంది.

డీఆర్‌డీవో రక్షణ విభాగంలో మైక్రోశాట్‌ ఉపగ్రహాల సేవలను వినిమోగించనున్నారు. కాగా పీఎస్‌ఎల్‌వీ సీరిస్‌లో ఇది 46వ ప్రయోగం తెలిసిందే. నూతన సంవత్సరంలో (2019) ఇస్రో ప్రయోగించిన తొలి ప్రయోగం విజయవంతం కావడం విశేషం. దీనికి కృషిచేసిన విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు