మీ మద్దతుకు ధన్యవాదాలు

18 Sep, 2019 21:15 IST|Sakshi

మాకు మద్దతుగా నిలిచిన దేశప్రజలందరికీ ధన్యవాదాలు

బెంగళూరు: భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌–2 ప్రయోగంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయిన అనంతరం తమకు మద్దతుగా నిలిచినవారందరికీ ఇస్రో కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది. ‘మాకు మద్దతుగా నిలిచిన దేశప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలల స్ఫూర్తిగా భవిష్యత్తులో మరింత ముందుకు సాగుతాం. మేం అంతరిక్ష బాటలో సజావుగా సాగేందుకు మీ స్ఫూర్తి మాకెంతో తోడ్పడుతుంది’ అని తన ట్విట్టర్‌ ఖాతాలో ఇస్రో పేర్కొంది.

కాగా, చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌–2 జూలై 22 నింగిలోకి దూసుకెళ్లింది. ఒక్కో దశ విజయవంతంగా పూర్తిచేసుకుంటూ చంద్రుడి ఉపరితల కక్ష్యలోకి చేరింది. అనంతరం ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ విడిపోయింది. అయితే, చంద్రుడి ఉపరిత లానికి 2.1 కిలోమీటర్ల దూరంలో భూకేంద్రంతో విక్రమ్‌కు సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి విక్రమ్‌తో తిరిగి అనుసంధానం అయ్యేం దుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు