ఎలక్షన్‌ కమిషనర్‌ భార్యకు ఐటీ నోటీసులు

25 Sep, 2019 11:02 IST|Sakshi
అశోక్‌ లవాసా (పైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావసా కుటుంబానికి  ఐటీ శాఖ ద్వారా ఎదురు దెబ్బ తగిలింది. ఆయన భార్య నోవల్ సింఘాల్. కమార్తె, కుమారుడి ఆదాయంపై ఐటీ విభాగం దృష్టి సారించింది.  ఆదాయ లెక్కల్లో తేడా ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు ఈ నోటీసులు  జారీ చేశారు. ముఖ్యంగా అశోక్ లవాసా తనయుడు నిర్వహిస్తున్న నౌరిష్ ఫుడ్స్ ఖాతాలలో అవకతవకలపై  దృష్టి సారించిన ఐటీ విభాగం ఈ  నోటీసులిచ్చింది. వారి ఆదాయ, వ్యయాలను గత కొన్నిరోజులుగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తోంది. 

2005 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన నుంచి నోవల్ సింఘాల్ లావాసా  ముందస్తు పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత వివిధ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. అప్పటివరకు నోవాల్ రిటర్నులపై ఎలాంటి సందేహాలు తలెత్తలేదు. కానీ గత కొన్ని నెలలుగా మాత్రం భారీ తేడాను ఐటీ అధికారులు గుర్తించారు. ఆదాయ, వ్యయాల్లో తేడాకు గల కారణాలపై ఇటీవల నోటీసులు కూడా జారీ  అయ్యాయి.  2015 నుంచి 2017 వరకు వివిధ కంపెనీలకు స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆదాయం కూడబెట్టారా అని ఐటీ అధికారులు  ఆరాతీస్తున్నారు. 

మరోవైపు దీనిపై నోవల్‌ సింఘాల్‌ స్పందించారు. తాను ఎలాంటి పన్నుల ఎగవేతకు, ఆదాయ అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. 28 సంవత్సరాల పాటుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో  క్లాస్‌ వన్‌ ఆఫీసర్‌గా పనిచేసిన తనకు బ్యాంకింగ్ సంబంధిత వ్యవహారాల్లో అపారమైన అనుభవం ఉందని  స్పష్టం చేశారు. ప్రస్తుతం  స్వతంత్ర డైరెక్టర్‌గా సహా వివిధ వృత్తిపరమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5, 2019న  అందుకున్న అన్ని  ఐటీ నోటీసులకు తాను సమాధానం ఇచ్చాననీ, ప్రస్తుత  ప్రక్రియకు కూడా సహకరిస్తున్నానని ఆమె వివరణ ఇచ్చారు.    

కాగా అంతకుముందు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసి అశోక్‌ గతేడాది జనవరి 23న కేంద్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశంపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా, కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ చంద్రతో  అశోక్‌ విభేదించిన సంగతి తెలిసిందే. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిన్మయానంద కేసులో కొత్త ట్విస్ట్‌.. విద్యార్థిని అరెస్ట్‌

‘మోదీ-షా బతికుండటం సోనియాకు ఇష్టం లేదు’

అమ్మకానికి సర్టిఫికెట్లు

మరాఠీల మొగ్గు ఎటువైపో?

నోట్లు మాకు.. చిల్లర మీకు

ప్రశాంత్‌ కిశోర్‌తో రజనీకాంత్‌ భేటీ!

పొత్తు కుదురుతుందా..? వికటిస్తుందా..? 

మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న మోదీ

టెక్నాలజీ కొంపముంచుతోంది 

పీవోకేలో భారీ భూకంపం 

విదేశీ విద్యార్థుల్లో నేపాలీలదే పైచేయి 

వాళ్లిద్దరూ కలిసి పనిచేయాలి 

శరద్‌పవార్‌పై మనీల్యాండరింగ్‌ కేసు 

బిగ్‌ బీకి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’

దాదా.. షెహెన్‌షా

గుండీలు పెట్టుకోలేదని జరిమానా

ఈనాటి ముఖ్యాంశాలు

బిగ్‌బీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

‘థ్యాంక్స్‌  గ్రెటా.. ముఖంపై గుద్దినట్లు చెప్పావ్‌’

బ్రేకింగ్‌: ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు

షర్టు పట్టుకుని ఈడ్చి.. పొలాల వెంట పరిగెత్తిస్తూ..

‘అది భారత్‌-పాక్‌ విభజన కన్నా కష్టం’

‘నా రాజకీయ జీవితం ముగియబోతోంది’

ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యం

పోలీసులపై కేంద్రమంత్రి చిందులు

‘బాలాకోట్‌’ దాడులపై మళ్లీ అనుమానాలు

పోలీసులకు ఆ అధికారం లేదు

నటిని పశువుతో పోల్చిన అధికారి

కాంగ్రెస్‌ నేతకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’

అలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటా!

నటి జెన్నీఫర్‌ మోసగత్తె ..!

పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు..

దాదా.. షెహెన్‌షా

అడవుల్లో వంద రోజులు!